మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:48 IST)

ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు.. ఎవరు?

ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి. అమెరికా, ఉత్తర కొరియా రెండో విడత చర్చలు వియత్నాంలో జరుగనుంది. ఇందుకోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వియత్నాంకు బయల్దేరారు. ఈ భేటీని సదుద్దేశంతో కూడుకుందని కిమ్ జాంగ్ సర్కారుకు చెందిన మీడియా వెల్లడించింది. 
 
ఈ వియత్నాం పర్యటనకు కిమ్ జాంగ్‌తో పాటు ఆయన సోదరి కూడా వెళ్తున్నారు. భద్రతా కారణాల రీత్యా కిమ్.. విమానాల్లో కాకుండా.. రైళ్లలోనే ప్రయాణం చేస్తారట. దక్షిణ కొరియా, చైనాకు పర్యటించాల్సిన అవసరం వస్తే.. కిమ్ జాంగ్ రైలు బండినే ఎంచుకుంటారు. రైలు మార్గం ద్వారా చైనా మార్గం మీదుగా వియత్నం చేరుకునేందురు రెండున్నర రోజులు పడుతుందని తెలుస్తోంది.