శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (15:12 IST)

ప్రపంచ అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్‌కు చోటు

Food Varieties
ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్లుగా పేరుగాచిన రెస్టారెంట్ జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్ చోటు దక్కింది. టాప్ 1000 రెస్టారెంట్లలో ఒకటిగా ఫలక్ నుమా ప్యాలెస్‌‍లోని 'ఆదా' రెస్టారెంట్ నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ 'లా లిస్టే' ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో మన భారతీయ నగరాలకు చెందిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం మన దేశంలో అత్యుత్తమ రెస్టారెంట్‌గా ఢిల్లీలోని 'ఇండియన్ యాక్సెంట్' నిలిచింది.
 
ఈ రెస్టారెంట్‌కు లా లిస్టే 95 పాయింట్లు ఇచ్చింది. ఆ తర్వాత 86 పాయింట్లతో బెంగళూరులోని కరావల్లి రెస్టారెంట్ రెండో స్థానంలో, 84 పాయింట్లతో హైదరాబాదీ 'ఆదా' మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాదీ వంటకాలకు అత్యంత ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్‌గా ఆదా ఈ జాబితాలో చోటుసంపాదించుకుంది. అమెరికాకు చెందిన లే బెర్నార్డిన్ రెస్టారెంట్ సహా ప్రపంచంలోని మొత్తం ఏ రెస్టారెంట్లు 99.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాయి.
 
'లా లిస్ట్' ప్రకారం ఇండియాలోని టాప్ 10 రెస్టారెంట్లు..
ఇండియన్ యాక్సెంట్ (న్యూఢిల్లీ), కరావల్లి (బెంగళూరు), ఆదా (ఫలక్ నుమా ప్యాలెస్, హైదరాబాద్), యౌచా (ముంబై), దమ్ పుస్త్ (న్యూఢిల్లీ), జమావర్ (లీలా ప్యాలెస్, బెంగళూరు), లే సర్క్యూ సిగ్నేచర్ (లీలా ప్యాలెస్, బెంగళూరు), మేగు (న్యూఢిల్లీ), బుఖారా (ఐటీసీ మౌర్య, న్యూఢిల్లీ), జియా (ముంబై)లు ఉన్నాయి.