గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 మే 2020 (21:11 IST)

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 మరణాలు 3,52,168

ప్రపంచవ్యాప్త దేశాలను కరోనా మహమ్మారి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 56,81,601కు చేరుకుంది.

వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,98,972. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,52,168 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 24,30,461 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా కారణంగా అగ్రరాజ్యం యూఎస్‌ఏ అత్యధిక ప్రభావానికి గురౌతుంది.

వైరస్‌ ప్రభావానికి గురై అమెరికాలో లక్షకు పైగా మంది మృతిచెందారు. కోవిడ్‌-19 కారణంగా యూఎస్‌ఏ ఇప్పటి వరకు 1 లక్ష 579 మంది చనిపోయారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి.

బ్రెజిల్‌-24,549, రష్యా-3,807, స్పెయిన్‌-27,117, యూకే-37,048, ఇటలీ-32,955, జర్మనీ-8,498, ఇరాన్‌-7,508, పెరూ-3,788, కెనడా-6,639, చైనా-4,634, మెక్సికో-8,134, పాకిస్థాన్‌-1,197, బెల్జియం-9,334, నెదర్లాండ్స్‌-5,856, స్వీడన్‌-4,125, పోర్చుగల్‌-1,342, స్విర్జర్లాండ్‌-1,915, ఐర్లాండ్‌-1,615, ఇండోనేషియా-1,418, పోలాండ్‌-1,024, రోమేనియాలో 1,216 మంది చనిపోయారు.