1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (08:54 IST)

యుద్ధానికి పిలుపునిచ్చిన చైనా అధ్యక్షుడు!!

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ సైన్యానికి ఓ పిలుపునిచ్చారు. ఏ క్షణాన యుద్ధం వచ్చినా, పూర్తి సన్నద్ధతతో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. సైనిక బలగాలపై అధ్యక్షునికి విస్తృత అధికారాలను కల్పిస్తూ, కొత్త రక్షణ చట్టం చైనాలో అమలులోకి వచ్చాయి. 
 
ఈ సందర్భంగా ఆయన చైనా పీపుల్స్ ఆర్మీతో మాట్లాడారు. సైనికులు పోరాట నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలని సూచించారు. వాస్తవ యుద్ధరంగాన్ని పోలి వుండే పరిస్థితుల్లో శిక్షణ పొందాలని ఆదేశించారు.
 
పోరాట వ్యూహాలపై మరింత పరిశోధనలు చేయాలని, అధునాతన ఆయుధాలను వాడే విధానం, వాటి ప్రయోగాల విషయంలో పూర్తి అవగాహన కలిగి వుండాలని జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగానూ ఉన్నారు. ఈ కమిషన్‌కు సంబంధించిన తొలి ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.