మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (15:51 IST)

జీవితంలో మోస‌పోలేదుః కాజ‌ల్ అగర్వాల్‌

Kajal Aggarwal
త‌న‌ను జీవితంలో ఎవ‌రూ మోస‌గించ‌లేద‌నీ, ఎవ‌రితోనూ మోస‌పోలేద‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ అంటోంది. అయితే ఆన్‌లైన్‌లో త‌న‌ అకౌంట్లో చిన్నమొత్తాన్ని కొంద‌రు మోసం చేసి తీసుకున్నార‌నీ, ఆ త‌ర్వాత వారికి త‌గిన శిక్ష ప‌డింద‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ అంటోంది. ఆమె తాజాగా విష్ణు మంచుతో అన్నాచెల్లెల్లుగా `మోస‌గాళ్ళు` సినిమాలో న‌టించింది.

కొన్ని కోట్ల రూపాయ‌ల ఆన్‌లైన్ మోసం నేప‌థ్యంలో ఈ క‌థ వుంటుంది. ఈ నెల 19న సినిమా విడుద‌ల ‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆమె మోస‌గాళ్లు సినిమాలో లాగా మీరు ఎవ‌రినైనా మోసం చేశారా? లేదా మీరు మోస‌పోయారా? అన్న ప్ర‌శ్న‌కు పైవిధంగా స‌మాధానం ఇచ్చింది. హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమె ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేసింది.
 
* దాదాపు ఈ సినిమా 5 భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇంగ్లీషులో కూడా విడుద‌ల‌ కానుంది. ఆ సినిమాకు నేను డ‌బ్బింగ్ చెప్పాను.
 
* నా క్లాస్‌మేట్ గౌత‌మ్‌నే నేను పెళ్ళిచేసుకున్నాను. ప‌ది సంవ‌త్స‌రాల క్రిత‌మే నాకు త‌ను బాగా తెలుసు. సినిమా షూటింగ్ బిజీలో వున్నా ప్రేమ‌కు స‌రైన స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయాను. ఇన్నాళ్లు మా ప్రేమ‌ను ర‌హ‌స్యంగా దాచ‌డానికి కార‌ణం గౌత‌మ్ తీసుకున్న నిర్ణ‌య‌మే.
 
* మేమిద్ద‌రం ఇంటి స‌మీపంలో వున్న సూపర్ మార్కెట్‌లో క‌లిసివేవాళ్ళం. మాస్క్‌ వేసుకుని గౌత‌మ్ వ‌చ్చేవాడు. నేను అలా వ‌చ్చేదాన్ని. ముక్త‌స‌రిగా మాట్లాడుకునేవాళ్ళం. ఎన్నాళ్ళు ఇలా అంటూ త్వ‌ర‌గా ఒక‌ట‌వుదామ‌ని అనుకున్నాం. ఈలోగా క‌రోనా వ‌చ్చింది. ఆ స‌మ‌యంలోనే మా ఇంటిలో పెండ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. నేను మా నాన్న‌గారికి, అమ్మ‌గారికి తెలియ‌జేశాను. అయితే వారికి ముందుగానే చూచాయ‌గా తెలిసినా పైకి ఏమి అడిగేవారుకాదు. ఆఖ‌రికి ఇరువురు కుటుంబాల స‌మ‌క్షంలో పెండ్లి చేసుకున్నాం.
 
* వివాహం త‌ర్వాత కూడా సినిమాలు చేయాల‌నే గౌత‌మ్ అన్నాడు. అలాంటి భ‌ర్త దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నాను.
* మోస‌గాళ్ళు సినిమా క‌థ‌గా చెప్పాలంటే, ముంబైలోని మాస్ ఏరియాలో వుంటూ ఆన్‌లౌన్ ద్వారా యు.ఎస్‌.లోని కొన్ని వేల కోట్ల రూపాయ‌ల‌ను ఎలా కొట్టేశామో అనేది క‌థ‌. ఇలా ఎందుకు చేశామ‌నేది తెర‌పై చూస్తేనే ఆస‌క్తిక‌రంగా వుంటుంది.
 
* ఈ సినిమాలో మంచు విష్ణు సోద‌రిగా చేయాల‌నే ద‌ర్శ‌కుడు చెప్పిన వెంట‌నే క‌థ బాగా న‌చ్చి ముందుకు వ‌చ్చాను. కంటెంట్ నేప‌థ్యంలో సాగే క‌థ క‌నుక ఎటువంటి పాట‌లు వుండ‌వు.
 
* మోహ‌న్‌బాబుగారు ఈ సినిమాలోని మా న‌ట‌న చూసి ఏడ్చార‌ని నిన్న ప్రీరిలీజ్‌లో చెప్పారు. అలా ఆయ‌న్ను అంత‌గా ఆక‌ట్టుకుందంటే రేపు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం వుంది.
 
* ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి కాంబినేష‌న్‌లో రెండ‌వ సినిమా,  సినిమా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లో వెబ్ సీరీస్ ‌కూడా చేస్తున్నాన‌ని అంది.