1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 11 జనవరి 2017 (20:53 IST)

18 ఏళ్ళకే బాలకృష్ణతో నటించా: బాలయ్య హీరోయిన్ శ్రియ గారాలు, ఇంటర్వ్యూ

దక్షిణాదిలో హీరోయిన్‌గా స్థాయి పొందిన నటీమణుల్లో శ్రియ ఒకరు. తాజాగా నందమూరి బాలకష్ణతో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో హీరోయిన్‌గా నటించారు. ఈ సందర్భంగా శ్రియతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.

దక్షిణాదిలో హీరోయిన్‌గా స్థాయి పొందిన నటీమణుల్లో శ్రియ ఒకరు. తాజాగా నందమూరి బాలకష్ణతో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో హీరోయిన్‌గా నటించారు. ఈ సందర్భంగా శ్రియతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
 
ఈ అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
దర్శకుడు కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. ఆ కథలో ఉన్న ఎమోషన్‌, వశిష్ట దేవి అనే నా పాత్ర అన్నీ బాగా నచ్చాయి. ఇలాంటి ఒక హిస్టారికల్‌ సినిమాలో మంచి పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
 
పాత్ర కోసం ఎలా సన్నద్ధం అయ్యారు?
మొదట్లో ఈ పాత్ర చేయగలనా? అని కంగారుపడ్డా. సెట్లోకి వచ్చేశాక బాలయ్య గారు, క్రిష్‌ వీరందరినీ చూసి నాకూ ధైర్యం వచ్చేసింది. రెండో రోజు నుంచే పాత్రను ఓన్‌ చేసుకొని నటించడం మొదలుపెట్టా. సెట్‌కి వెళ్ళకముందు పెద్దగా ప్రిపేర్‌ అయింది ఏమీ లేదు. క్రిష్‌ విజన్‌ను ఫాలో అయ్యానంతే.
 
బాలకృష్ణతో చాన్నాళ్ళకు పనిచేయడం ఎలా అనిపించింది?
'చెన్నకేశవరెడ్డి' సినిమాలో నటించినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే బాలయ్య గారితో నటించేశా. ఆయన కో-యాక్టర్స్‌కు మంచి గౌరవం ఇస్తారు. అలాంటి లెజెండరీ యాక్టర్‌ వందో సినిమాలో, అదీ శాతకర్ణి లాంటి స్పెషల్‌ సినిమాలో భాగమవ్వడం అదృష్టంగానే భావిస్తా. షూటింగ్‌లో నా పాత్రకు సంబంధించి చాలా సలహాలు ఇచ్చేవారు. ఇద్దరం సెట్లో హిస్టరీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటూండేవాళ్ళం.
 
సినిమా విజయంపై ధీమాగా ఉన్నారా? సంక్రాంతి పోటీని ఎలా చూస్తారు?
మంచి సినిమాతో వస్తున్నాం కాబట్టి విజయంపై సాధారణంగానే ధీమాగా ఉన్నాం. ఇక పోటీ అనేది సినిమాల మధ్యన ఎప్పుడూ ఉంటుంది. ఏ సినిమాకైనా అందరం కష్టపడి పనిచేస్తాం. కాబట్టి అన్ని సినిమాలూ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. నేను గౌతమిపుత్ర శాతకర్ణిలో నటించాను కాబట్టి మా సినిమా ఇంకొంచెం పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. అదే నా స్వార్థం కూడా అని చెప్పారు.