సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు.. టీమ్‌లో ఏం జరిగింది..?

suresh raina
suresh raina
సెల్వి| Last Updated: శనివారం, 2 జనవరి 2021 (11:38 IST)
ఐపీఎల్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా ఆడని సంగతి తెలిసిందే. ఈ టోర్నీ నుంచి రైనా అర్ధాంతంగా తప్పుకున్నాడు. టోర్నీలో ఆడేందుకే దుబాయ్ వెళ్లిన రైనా.. అది మొదలు కాకముందే తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అయితే తాను ఐపీఎల్ ఎందుకు ఆడలేదన్నదానిపై ఎన్నో పుకార్లు వచ్చినా ఇన్నాళ్లూ నోరు మెదపని రైనా.. తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆడకపోవడానికి కారణాన్ని నేరుగా చెప్పలేదు కానీ.. టీమ్‌లో ఏదైనా జరిగిందా అన్న అనుమానం కలిగేలా రైనా మాట్లాడాడు. మనం సంతోషంగా లేకపోతే వెనక్కి వచ్చేయాలన్నదే తన ఆలోచన అంటూ చెప్పుకొచ్చాడు. ఏదో ఒత్తిడితో ఏదో అయిపోదు. క్రికెటర్లు సహజంగానే తమకు తాము టీమ్ కంటే ఎక్కువని ఫీలవుతుంటారు. ఒకప్పుడు సినిమా నటులు ఇలా ఉండేవారు అని అవుట్‌లుక్‌తో ఇంటర్వ్యూలో రైనా అనడం విశేషం.

ఇక ఐపీఎల్‌లో ఆడకపోవడం వల్ల తానేమీ బాధపడటం లేదని, తన పిల్లలు, కుటుంబంతో గడపడం సంతోషంగా ఉందని రైనా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కుటుంబానికి తాను అవసరమని తెలిపాడు.

''20 ఏళ్లుగా నేను ఆడుతున్నా. కానీ అవసరమైన సమయంలో కుటుంబానికి మనం అందుబాటులో ఉండాలి. అందుకే ఆ సమయంలో ఐపీఎల్‌లో ఆడకుండా వెనక్కి వచ్చేయడమే సరైనదని నాకు అనిపించింది" అని రైనా అన్నాడు. అయితే దుబాయ్ హోటల్‌లో రైనా బాల్కనీ ఉన్న రూమ్ కోసం అడిగాడని, అది కుదరకపోవడంతో అసంతృప్తి వల్లే తిరిగి ఇండియాకు వచ్చాడన్న వార్తలు వచ్చాయి.దీనిపై మరింత చదవండి :