గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (16:43 IST)

ఐపీఎల్ 2022 : అత్యధిక సిక్సర్ల రికార్డ్ నమోదు.. బాదింది ఎవరంటే?

Liam Livingstone
Liam Livingstone
ఐపీఎల్ 2022 పలు రికార్డులకు వేదికగా మారుతోంది. సింగిల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును (వెయ్యి) 15వ ఐపీఎల్ సీజన్ సొంతం చేసుకుంది. 
 
ఈ సీజన్‌ తొలి సిక్సర్‌ను సీఎస్‌కే బ్యాటర్‌ రాబిన్‌ ఉతప్ప బాదగా.. థౌజండ్‌ వాలా సిక్సర్‌ను లివింగ్‌స్టోన్‌ పేల్చాడు. ఈ సీజన్‌ లాంగెస్ట్‌ సిక్సర్‌ రికార్డు కూడా లివింగ్‌స్టోన్‌ పేరిటే నమోదై ఉండటం విశేషం. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం సన్‌రైజర్స్‌-పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదైంది. పంజాబ్‌ హిట్టర్‌ లివింగ్‌స్టోన్‌ సిక్సర్‌తో (1000వ సిక్సర్‌) ఐపీఎల్‌ 2022 సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.
 
అంతకుముందు 2018 సీజన్‌లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్‌ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్‌లో ఆ రికార్డు బద్దలైంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో మరో వంద సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది.