సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (14:00 IST)

రిలయన్స్ జియోతో పోటీ.. 10జీబీ డేటాతో కొత్త ఆఫర్.. అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్

రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మై హోమ్ పథకంలో ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్‌లో డిటిహెచ్ సేవలకుగాను నెలకు 10 జీబీ డేటాను అంద

రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మై హోమ్ పథకంలో ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్‌లో డిటిహెచ్ సేవలకుగాను నెలకు 10 జీబీ డేటాను అందించనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. జియోకు పోటీగానే ఎయిర్‌టెల్ తన టారిఫ్ ప్లాన్లను మార్పులు చేర్పులు చేసింది. 
 
ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో కస్టమర్లను తనవైపుకు తిప్పుకొంది. మరోవైపు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి జియో కూడ రానుంది. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడా బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి రానుంది.

ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్ పెయిడ్ డిటిహెచ్ సేవలపై నెలకు 10 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్‌తో పాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ డిజిటల్ టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది.