శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (12:06 IST)

ఐఫోన్-6లో బ్యాటరీ సమస్యా? అయితే ఉచితంగా బ్యాటరీ రీప్లేస్‌మెంట్ పొందండి..

ఐఫోన్6లో లో బాటరీ సమస్య వేధిస్తుందా.. అయితే దగ్గర్లోని యాపిల్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి ఉచితంగా బ్యాటరీని రీప్లేస్‌మెంట్‌ చేయించుకునే అవకాశం పొందండి. అంతేకాదు ఫోనులో ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా యాపిల్‌

ఐఫోన్6లో లో బాటరీ సమస్య వేధిస్తుందా.. అయితే దగ్గర్లోని యాపిల్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి ఉచితంగా బ్యాటరీని రీప్లేస్‌మెంట్‌ చేయించుకునే అవకాశం పొందండి. అంతేకాదు ఫోనులో ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా యాపిల్‌ సంస్థ ఉచితంగా మరమ్మతులు చేసి ఇస్తుందట. 
 
అయితే ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఉచిత ఆఫర్‌ కోసం వినియోగదారులు ముందుగా ఏదైనా యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ని గానీ.. ఆథరైజ్డ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ను గానీ సంప్రదించాలి. అయితే ఫోన్ తయారీకి సంబంధించిన సీరియల్ నెంబర్ ఆధారంగా మీరు ఉచిత సర్వీస్‌కు అర్హులా? కాదా అనే విషయం కూడా తెలిసిపోతుంది. 
 
2015 సెప్టెంబరు, అక్టోబరులో తయారైన ఐఫోన్‌ 6-ఎస్‌ ఫోన్లలో బ్యాటరీ సమస్య ఉందని.. ఆ నెలల్లో తయారుచేసిన ఫోన్ల బ్యాటరీలను మాత్రమే ఉచితంగా మార్చి ఇస్తామని యాపిల్‌ ప్రకటించింది. ఒకవేళ ఇప్పటికే బ్యాటరీని సొంత ఖర్చుతో మార్చుకున్నట్లయితే ఆ డబ్బును యాపిల్‌ రీ-ఫండ్‌ చేయనుంది. అంతేకాదు ఫోన్‌లో ఏవైనా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నా ఉచితంగా రిపేర్‌ చేయించి ఇస్తుందట.