శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (18:06 IST)

ల్యాండ్​ లైన్​ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్​న్యూస్​.. ఈ మైగ్రేట్​ సేవలు..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ల్యాండ్​ లైన్​ యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. పాత ల్యాండ్​లైన్ నెంబర్​తోనే ఫైబర్ టు హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్​కు మైగ్రేట్ కావడానికి అవకాశం కల్పిస్తోంది. 
 
హువావే, యూటీ స్టార్‌కామ్ ల్యాండ్‌లైన్ నంబర్లతో సహా అన్ని బీఎస్​ఎన్​ఎల్ ల్యాండ్​లైన్​​ యూజర్లకు ఈ మైగ్రేట్​ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే సీడీఓటీ యూజర్లకు మాత్రం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు.
 
బీఎస్​ఎన్​ఎల్ ఈ స్కీమ్​ను గతేడాది సెప్టెంబర్​లోనే ప్రారంభించింది. దీని ప్రకారం బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్‌లైన్ కస్టమర్లు తమ ల్యాండ్‌లైన్ నంబర్‌ను భారత్ ఫైబర్ వాయిస్ లేదా వాయిస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు.
 
బీఎస్​ఎన్​ఎల్​ కేరళ టెలికాం సర్కిల్​ ముందుగా దీన్ని అమల్లోకి తెచ్చింది. యూజర్లు తమ ల్యాండ్‌లైన్ నంబర్‌ని ఫైబర్ కేటగిరీగా మార్చేందుకు వారి సిస్టమ్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను చేర్చింది. 
 
బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్​లైన్​ కస్టమర్లు బ్రాండ్​ బ్యాండ్​ సేవలకు మైగ్రేట్​ కావాలనుకుంటే వెంటనే సమీపంలోని బీఎస్​ఎన్​ఎల్​ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.