బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:12 IST)

బ్రాడ్​బ్యాండ్​ యూజర్లకు షాకింగ్​ న్యూస్.. యూజర్లకు బీఎస్ఎన్ఎల్ షాక్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్​ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్​) తన బ్రాడ్​బ్యాండ్​ యూజర్లకు షాకింగ్​ న్యూస్​ చెప్పింది. సోమవారం నుండి కొన్ని ఫైబర్ ప్లాన్‌లను నిలిపియనున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ తన యూజర్లకు 2020 అక్టోబర్​ 1 నుండి ఫైబర్​ బేసిక్​, ఫైబర్​ వాల్యూ, ఫైబర్​ ప్రీమియం, ఫైబర్​ అల్ట్రా పేర్లతో నాలుగు బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లను అమలు చేస్తోంది. 
 
ఈ నాలుగు ప్లాన్లలో రెండు ప్లాన్లను ఇప్పుడు నిలిపివేసింది. దీంతో, ఇకపై బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ యూజర్లకు కేవలం ఫైబర్ బేసిక్ ప్లస్, ఫైబర్ ప్రీమియం ప్లస్ అనే రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌ కోసం ప్రతి నెలా రూ .599 (పన్నులు మినహాయించి) ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్లాన్‌కు ప్రతినెలా రూ .1,277 (పన్ను మినహాయించి) ఖర్చవుతుంది. 
 
బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ .599 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 60 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ /అప్‌లోడ్ స్పీడ్​తో కూడిన 3.3 టిబి లేదా 3,300 జీబి డేటాను పొందుతారు. ఈ డేటా లిమిట్​ పూర్తయిన తర్వాత బ్రౌజింగ్​ స్పీడ్​ 2 Mbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్​ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ సదుపాయాన్ని కూడా అందిస్తుంది.
 
బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ప్రీమియం ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ .1,277 వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 200 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్/ అప్‌లోడ్ స్పీడ్​తో కూడిన 3.3 టిబి లేదా 3,300 జిబి డేటాను పొందుతారు. ఈ డేటా లిమిట్​ పూర్తయిన తర్వాత, బ్రౌజింగ్​ స్పీడ్​ 15 Mbps కి పడిపోతుంది.