'దిల్ ఖోల్ కే బోల్' పేరిట బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయ ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు.. ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్ వినియోగదారుల

bsnl logo
pnr| Last Updated: బుధవారం, 1 మార్చి 2017 (11:05 IST)
రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు.. ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

'దిల్ ఖోల్ కే బోల్' పేరిట రూ.799 నెలసరి చెల్లింపుతో అపరిమిత వాయిస్ కాల్స్ అందుకోవచ్చని, ఆపై 6 గిగాబైట్ల ఉచిత డేటాను అందిస్తామని తెలిపారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి తొలి నాలుగు నెలలూ 6 జీబీ డేటాను, ఆపై నెలకు 3 జీబీ డేటాను అందిస్తామన్నారు.

అధిక డేటా కావాలని కోరుకునే వారికోసం రూ.1125తో 10 జీబీ, రూ.1525తో 30 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు సంస్థ తెలంగాణ సర్కిల్ సీజీఎం అనంతరామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1503, 18001801503 నంబర్లలో సంప్రదించాలని వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :