జియో సిమ్‌కు పోటీగా ఎయిర్‌టెల్ 'బాహుబలి' సిమ్... ఫ్రీ 4జి డేటా, ప్రభాస్ పెళ్లి న్యూస్...
జియో సిమ్ దెబ్బకు ఎంత చేసినా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు రకరకాలుగా అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది. అదికూడా బాహుబలి పేరుతో సిమ్‌ను తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాదులో కంపెనీ సీఈఓ వె
జియో సిమ్ దెబ్బకు ఎంత చేసినా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు రకరకాలుగా అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది. అదికూడా బాహుబలి పేరుతో సిమ్‌ను తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాదులో కంపెనీ సీఈఓ వెంకటేశ్ విజయరాఘవన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి, నటి అనుష్కలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... త్వరలోనే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్ ప్యాక్ ఆఫర్లను తెలియజేస్తామన్నారు. కూడా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. నటుడు ప్రభాస్ మాట్లాడుతూ... అంతా తన పెళ్లి గురించి అడుగుతున్నారనీ, ఈ నెల బాహుబలి విడుదలతో పాటు తన పెళ్లి విషయం కూడా తెలుస్తుందంటూ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.