సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (16:23 IST)

ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువు- నవంబర్ 30 వరకు పొడిగింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మార్చి31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్‌ దాఖలుకు సీబీడీటీ గతంలో జూన్‌ 30వరకు గడువు విధించింది. 
 
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గనందున, ఈ గడువును జులై 31, సెప్టెంబరు 30 వరకు దశలవారీగా పొడిగించింది. అయితే ఈ గడువును నాలుగోసారి నవంబరు 30వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.