మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (18:43 IST)

పుతిన్‌కు షాకిస్తున్న హ్యాకర్స్.. 48 గంటల్లో 35వేల కంటే ఎక్కువ..?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది. రష్యా ప్రభుత్వ తీరును తప్పు బట్టిన ఆ దేశ హ్యాకర్లు అధ్యక్షుడు పుతిన్‌కు షాకిస్తున్నారు. ఈ వారంలో రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌కు చెందిన రహస్యాల్ని బహిర్గతం చేశామని గుర్తు తెలియని హ్యాకర్స్‌ గ్రూప్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది. నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా.. రష్యన్‌ హ్యాకర్లు హెచ్చరికలు జారీ చేశారు. 
 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. త్వరలో మీరు ప్రపంచ హ్యాకర్ల ఆగ్రహానికి గురవుతారని ప్రకటించారు. అన్నట్లుగానే ఈ వారం ప్రారంభంలో ఉక్రేనియన్ భవనాలపై దాడికి గురైన దృశ్యాలను ప్రజలకు చూపించేందుకు రష్యన్ స్టేట్ టీవీ నెట్‌వర్క్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో రష్యన్‌లు అయోమయానికి గురయ్యారు. 
 
తాజాగా Anonymous అనే హ్యాకర్స్‌ గ్రూప్‌ చీకటి ఒప్పందాలకు సంబంధించి 35వేల పేపర్లను బహిర్గతం చేస్తామని ట్వీట్‌ చేసింది "జస్ట్ ఇన్ #Anonymous కలెక్టివ్ రష్యా సెంట్రల్ బ్యాంక్‌ను హ్యాక్ చేశాం. 48 గంటల్లో 35,000 కంటే ఎక్కువ రహస్య ఒప్పంద పత్రాలు విడుదల చేయబడతాయి" అని ట్వీట్‌లో పేర్కొంది.