మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (20:07 IST)

వాట్సాప్‌లో హార్ట్ సింబల్ ఎమోజీని సెండ్ చేస్తే..?

Love
వాట్సాప్‌లో ఎమోజీలతో అభిప్రాయాలను ఫీలింగ్స్‌ను తెలుపుతుంటాం. అదే ప్రేమను తెలియజేయాలంటే హార్ట్ సింబల్ సెండ్ చేస్తే సరిపోతుంది. దానికి మాటలు పదాలు టైమ్ చేయనవసరంలేదు. తాజాగా వాట్సాప్‌లో రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 
 
హార్ట్‌ సింబల్‌ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, సౌదీ కరెన్సీలో 100,000 అంటే భారత కరెన్సీలో రూ.20 లక్షల జరిమానా విధిస్తామంటూ ప్రకటించింది. అవతలి వ్యక్తి ఇష్టమైతే కాస్త ఓకే.. కానీ ఇష్టం లేకుండా పంపిస్తే మాత్రం జరిమానా తప్పదంటూ సౌదీ అరేబియా తెలిపింది. 
 
అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒక్కోసారి జైలుశిక్ష కూడా పడవచ్చు.