శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 జులై 2023 (17:11 IST)

జైలర్ నుంచి రజనీకాంత్‌, తమన్నాపై కావాలి పాట విడుదల

Rajinikanth and Tamannaah
Rajinikanth and Tamannaah
సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్'. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జైలర్ ఫస్ట్ సింగిల్ 'కావాలయ్యా’పాట తమిళ్ వెర్షన్ లో విడుదలై నేషనల్ వైడ్ గా వైరల్ అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై టాప్ ట్రెండింగ్ లో వుంది.
 
ఇప్పుడీ సాంగ్ తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు మేకర్స్. అనిరుధ్‌ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్ గా కంపోజ్ చేశారు. శ్రీ సాయి కిరణ్  సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్‌ కలసి హైలీ ఎనర్జిటిక్  గా పాడారు. ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి.
 
ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ రమ్య కృష్ణన్, తమన్నా తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
 
టాప్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తోంది. విజయ్ కార్తిక్ కన్నన్ కెమరామెన్ గా పనిచేస్తుండగా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. డిఆర్ కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
జైలర్ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తారాగణం: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు , రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు