సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (10:03 IST)

తమన్నాపై పిచ్చి ప్రేమ..రొమాంటిక్ దశ మొదలైంది.. విజయ్ వర్మ

tamannah - vijay varma
మిల్కీ బ్యూటీ తమన్నాపై విజయ వర్మ ప్రేమాయణం గురించి ప్రస్తుతం వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ వర్మ తమ్మన్నాపై తన ఫీలింగ్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో బయటపడ్డాడు. 
 
తాము ప్రేమలో వున్నామనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నానని.. తన లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయిందని, రొమాంటిక్ దశ మొదలైందని తెలిపాడు. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ దగ్గరయ్యారు. 
 
విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై తమన్నా కూడా స్పందించింది. "ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది." అని తమన్నా వెల్లడించింది.