గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (12:14 IST)

యాంకర్ విష్ణుప్రియతో ప్రేమాయణం.. అబ్బే అవన్నీ గాలి వార్తలే.. జేడీ

jd chakravarthy
ప్రముఖ దర్శకుడు జేడీ చక్రవర్తి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. 90టీస్, 20టీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత నటుడిగా మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఇటీవ‌లే ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాడు.
 
"దయా" అనే వెబ్ సిరీస్‌లో అతను ప్రధాన పాత్రలో నటించాడు. కానీ అతను తన వెబ్ సిరీస్ కోసం కాకుండా, యాంకర్-టర్న్-నటి విష్ణుప్రియ భీమినేనితో అతను ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. 
 
ఇంకా విష్ణుప్రియ తాను జెడి చక్రవర్తితో ప్రేమలో ఉన్నానని, అతనిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఒక షోలో అంగీకరించింది. ఈ వ్యాఖ్యలు పలు పుకార్లకు దారితీసింది.
 
ఇటీవలే భార్యకు విడాకులు ఇచ్చిన జెడి చక్రవర్తి సింగిల్‌గా వున్నాడు. ప్రస్తుతం విష్ణుప్రియతో అతని రొమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పుకార్లపై ప్రస్తుతం జేడీ స్పందించాడు. విష్ణుప్రియకు సంబంధం లేదని స్పష్టం చేశాడు.
 
"దయా" అనే వెబ్ సిరీస్‌లో తాము స్క్రీన్ టైమ్‌ను పంచుకున్నామని తెలిపాడు. అంతేగానీ మా మధ్య వేరే సంబంధాలు లేవి చెప్పుకొచ్చాడు.