గూగుల్ ఖాతా సురక్షింతగా ఉండాలంటే.. ఇలా చేయండి?

Last Updated: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:26 IST)
ఇటీవలికాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, సైబర్ కేటుగాళ్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఫలితంగా బ్యాంకు ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. అయితే, సైబర్ నేరగాళ్ళ బారినపడటానికి ప్రధాన కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ ఆపరేషన్లపై పెద్దగా అవగాహన లేకపోవడమే. అయితే, సైబర్ క్రైమ్ బారినపడకుండా ఉండాటంలే.. పది చిట్కాలు (టిప్స్) పాటిస్తే సరిపోతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లను గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు.
2. ముఖ్యంగా, కంపెనీలకు చెందిన కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ సెర్చ్ చేయరాదు.
3. గూగుల్‌లో వివిధ రకాల యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్‌ల కోసం అన్వేషణ లేదా డౌన్‌లోడ్ చేయరాదు.
4. గూగుల్ సెర్చింజన్‌లో మందులు లేదా మెడికల్ సింప్టమ్స్‌ను శోధించరాదు.
5. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, సహాలు, స్టాక్ మార్కెట్ వివరాలను సెర్చ్ చేయడం మానుకోవాలి.
6. సైబర్ నేరగాళ్ల ప్రధాన అడ్డా ప్రభుత్వ వెబ్‌సైట్లు. అందువల్ల గూగుల్‌లో ప్రభుత్వ వెబ్‌సైట్ల కోసం శోధించరాదు.
7. కొత్త వెబ్‌సైట్లను గూగుల్‌లో సెర్చ్ చేయరాదు. అలాగే, వ్యక్తిగత వివరాలతో లాగిన్ చేయరాదు.
8. ప్రధానంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లను శోధించడం, ఆ వెబ్‌సైట్లలోని వివిధ రకా ఆఫర్ల కోసం సెర్చ్ చేయకూడదు.
9. గూగుల్ సెర్చింజన్‌లా యాంటి వైరస్ యాప్స్ లేదా సాఫ్ట్‌వేర్ల కోసం శోధించరాదు.
10. డిస్కౌంట్ల కోసం గూగుల్ సెర్చింజన్‌లో కూపన్ కోడ్స్‌ను సెర్చ్ చేయరాదు.దీనిపై మరింత చదవండి :