బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (17:26 IST)

టిక్ టాక్‌పై పిచ్చి మహాముదురు.. జాగ్రత్త సుమా!

దేశవ్యాప్తంగా టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ వచ్చినా.. మొబైల్ ప్లే స్టోర్స్‌లో ఈ యాప్ అందుబాటులోనే వుంది. టిక్ టాక్ యాప్ ఒకల్ని సూపర్ స్టార్ చేస్తుంది. మరొకరి కొంప ముంచుతుంది. కొంతమందిని చంపేస్తుంటుంది. ఇప్పటికే ఈ యాప్ వల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోయారు. చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ వీడియోలను టిక్ టాక్‌లో పోస్ట్ చేయడం యూత్‌కు ఆనవాయితీగా మారింది. 
 
విన్యాసాలు చేస్తూ.. శారీరకంగా గాయాలపాలయ్యే వారున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే వారున్నారు. తేడా చేస్తే ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్‌గా సోషల్ మీడియా స్టార్ సోనికా కేతావత్ మరణం మొత్తం నెట్టింట్లో పెద్ద సంచలనమైన విషయం తెలిసిందే. కేవలం టిక్ టాక్ మీద ఉన్న పిచ్చి.. ఆమె ప్రాణాలను హరించింది. బైక్ రైడింగ్‌లో ఏర్పడిన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
ఇలా ఒకరు మాత్రమే కాదు.. చాలామంది టిక్ టాక్ పిచ్చి పీక్స్‌కు చేరి ప్రాణాలు కోల్పోయారు. అందుకే సైకాలజిస్టులు టిక్ టాక్‌తో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి యాప్స్‌కు యువత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.