శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (17:57 IST)

ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ అక్షింతలు: వాట్సాప్ డీల్‌‌లో మాట మారింది.. 12కోట్ల జరిమానా!

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. వాట్సాప్ టేకోవర్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో 12కోట్ల డాలర్ల జరిమానా విధించినట్లు యూరోపియన్ కమిషన్ వెల్ల

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. వాట్సాప్ టేకోవర్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో 12కోట్ల డాలర్ల జరిమానా విధించినట్లు యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. 
 
ఈ సందర్భంగా ఈయూ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్ విలీన నిబంధనలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. అయితే దీనిపై ఫేస్ బుక్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. యూరోపియన్ కమిషన్‌కు తాము పూర్తిగా సహకరించామని వెల్లడించింది. 
 
కాగా 2014లో వాట్సప్‌ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న సందర్భంగా ఈయూ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. అప్పట్లో ఫేస్ బుక్, వాట్సాప్‌లను వేర్వేరుగా ఉంచుతామని చెప్పిన ఫేస్ బుక్.. 2016లో మాట మార్చింది. ఫేస్ బుక్, వాట్సప్ రెండింటిలోనూ యూజర్ల సమాచారాన్ని కలిపే ఛాన్సుందని ప్రకటన చేయడంతో యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది.