మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:38 IST)

గూగుల్ మ్యాప్స్‌ నావిగేషన్‌లో టూ వీలర్ మోడ్- ప్లే స్టోర్‌లో గూగుల్ గో యాప్

సెర్చింజన్ గూగుల్ మ్యాప్స్ ద్వారా దారి తెలియని వారిని గమ్యస్థానాలకు చేరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌లో టూ వీలర్ మోడ్ కూడా చేరిపోయింది. గూగుల

సెర్చింజన్ గూగుల్ మ్యాప్స్ ద్వారా దారి తెలియని వారిని గమ్యస్థానాలకు చేరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌లో టూ వీలర్ మోడ్ కూడా చేరిపోయింది. గూగుల్ మ్యాప్స్‌ను అప్ డేట్ చేస్తే ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్లు ప్రయాణించేందుకు వీలుకాని ఇరుకు రోడ్లు ఉన్న కొన్ని దేశాల్లో ఈ టూ-వీలర్ ఫీచర్‌ని గూగుల్ ఆవిష్కరించింది. 
 
ఇప్పటికే కారు, బస్సు, కాలినడక ద్వారా గమ్యస్థానానికి వెళ్లే దారుల సమాచారాన్నిచ్చే గూగుల్.. ప్రస్తుతం టూవీలర్ మోడ్‌ని కూడా చేర్చింది. దీనిద్వారా గమ్యస్థానాన్ని సులభంగా కనిపెట్టవచ్చు. అంతేకాకుండా గమ్య‌స్థానంలో టూ వీల‌ర్ పార్కింగ్ ప్ర‌దేశాల‌ను కూడా మ్యాప్‌లో చూపిస్తుంది. మోటార్ బైకులు అత్యధికంగా వాడే భారతీయ వినియోగదారులకు ప్రత్యేకంగా సదుపాయాన్ని ఆవిష్కరించారు.
 
మరోవైపు.. ప్లే స్టోరులో డేటాను తక్కువగా వినియోగించుకునే రీతిలో గూగుల్ గో పేరుతో ఓ సెర్చింజన్ యాప్‌ను కూడా గూగుల్ ఆవిష్క‌రించింది. తక్కువ డేటా, నెట్‌వర్క్ స్లో, తక్కువ స్టోరేజీ వున్న వినియోగదారుల కోసం ఈ యాప్ సహకరిస్తుంది. ఈ యాప్ త‌క్కువ డేటాను వినియోగించుకోవ‌డ‌మే కాకుండా సెర్చ్ ఫ‌లితాల‌ను కూడా చాలా వేగంగా అంద‌జేస్తోంది.