ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:13 IST)

హెచ్ఎండీ నుంచి స్కైలైన్ సిరీస్.. ఫీచర్స్ ఇవే.. ధర రూ.35,999

HMD Skyline Smartphone Series
HMD Skyline Smartphone Series
నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు హెచ్ఎండీ భారతదేశంలో తన స్వంత బ్రాండ్ స్కైలైన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. హెచ్ఎండీ స్కైలైన్ సిరీస్ ప్రీమియం ఫీచర్లు, వినూత్న డిజైన్‌లు కస్టమర్లను తప్పకుండా ఆకట్టుకుంటాయని హెచ్ఎండీ వెల్లడించింది.

HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్: ఫీచర్లు HMD స్కైలైన్ అద్భుతమైన 6.55-అంగుళాల పూర్తి HD+ పోలెడ్ డిస్‌ప్లే (1080 x 2400p) 20:9 యాస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.

డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కలిగివుంది. ఈ ఫోన్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54-రేట్‌తో కలిగివుంటుంది. ఇది నానో సిమ్‌లు, మైక్రో SD కార్డ్‌ల కోసం డ్యూయల్ స్లాట్‌లను కూడా కలిగి ఉంది. ఇ-సిమ్‌కు మద్దతు ఇస్తుంది.

టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. స్కైలైన్ ఫోన్ వెనుకవైపు ఆకట్టుకునే ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ట్విస్టెడ్ బ్లాక్, నియాన్ పింక్ రంగుల్లో లభ్యమవుతున్న ఈ HMD స్కైలైన్ ధర రూ.35,999.