ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (13:43 IST)

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ ... ఎలా పొందాలి?

whatsapp
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోనును వాడుతున్న ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ వాట్సాప్ యాప్‌ను కలిగివుంటాడు. అందుకే ఎప్పటికపుడు సరికొత్త ఫీచర్లతో పాటు అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తెస్తుంది. ఇలా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మెసేజింగ్ యాప్.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. 
 
తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చింది. కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. వాయిస్ నోట్ ట్రాన్స్ట్ . ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇకపై వారికొచ్చిన వాయిస్ మెసేజ్‌ను చదువుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఈ సులభమైన కొత్త ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి తాజా వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
తొలుత వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్ వాట్సాప్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకుని సెట్టింగ్ మెనులో వాయిస్ నోట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.