శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 జనవరి 2021 (18:38 IST)

కూ యాప్‌ని ఉపయోగించమని ప్రోత్సహిస్తున్న ప్రధాని, తెలుగు వారంతా కూ యాప్ తెలుగులో చేరండి

కూ యాప్ అనేది ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్ యాప్. ఇది భారతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తూ ప్రారంభించారు. ప్రజలు వారి మాతృభాషలో తమని తాము వ్యక్తపరుచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కూ యాప్ 2020 మార్చిలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇది తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, గుజరాతీ, మరాఠీ మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది. కూ యాప్‌ని తెలుగులో ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు మైక్రో బ్లాగుగా అవతరించింది. తెలుగులో మరే ఇతర మైక్రో బ్లాగుతో పోల్చినా ఇందులోనే ఎక్కువ సంఖ్యలో ఆలోచనలు మరియు అభిప్రాయాలను ప్రజలు పంచుకుంటున్నారు.
 
ఇటీవల మన భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో గెలుపొందిన యాప్‌లలో కూ యాప్‌‌ని కూడా విజేతగా ప్రకటించారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన భారతీయులను భారతీయ భాషలలో తమని తాము వ్యక్తపరచడానికి కూ ను ఉపయోగించమని ప్రోత్సహించారు.
 
మార్చిలో ప్రారంభించినప్పటి నుండి చాలామంది ప్రముఖ వ్యక్తులు ఈ వేదికలో చేరారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే మరియు జవగల్ శ్రీనాథ్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, డికె శివకుమార్, పోలీస్ కమిషనర్ కమల్ పంత్, బాలీవుడ్ నటులు అశుతోష్ రానా, ఆశిష్ విద్యార్థి తదితరులు ఉన్నారు. వారికి కూలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు మరియు వారి ఆలోచనలను తోటి యూజర్లతో ప్రతి రోజు పంచుకుంటారు.
 
యూజర్లు తెలుగులో కూ ను ఉపయోగించినప్పుడు వారు తెలుగులో లీనమైపోయిన అనుభవాన్ని పొందుతారు. రాజకీయ నాయకులు, చలన చిత్ర పరిశ్రమకి చెందిన వారు, క్రీడాకారులు, రచయితలు, కవులు, గాయకులు, కంపోజర్స్, జర్నలిస్టులు, సంపాదకులు మరియు కొన్ని వేల వృత్తులకు చెందిన లక్షలాది ప్రజలు ఉన్నారు. మరెక్కడా వినని విధంగా రైతులు, డ్రైవర్లు, వడ్రంగులు, కూలీలు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల యొక్క కూ లను మీరు చూడవచ్చు.
 
కూ యొక్క సీఈఓ & సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ, “కూ యాప్ అతి పెద్ద తెలుగు మైక్రో బ్లాగింగ్ యాప్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వతహాగా ప్రభుత్వం మరియు భారతీయ ప్రజలు స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటారు. అందుకే భారతీయులు భారతదేశంలో తయారు చేసిన యాప్‌లను ఉపయోగించడానికి ఉత్సాహం చూపిస్తారు. తెలుగు వారు ఆసక్తికరమైన అనేక మంది వ్యక్తులను ఫాలో అవ్వడానికి మరియు వారి ఆలోచనలు ప్రతి రోజు వ్యక్తపరచడానికి కూ యాప్ ఒక సురక్షితమైన వేదికను తయారు చేసింది. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరినీ కూ తెలుగులో చేరమని, వారి ఆలోచనలు, అభిప్రాయాలు సమాజం లోని మిగతా వారితో పంచుకోవాలని మేము ఆహ్వానిస్తున్నాము ” అని తెలిపారు.
 
కూ యొక్క ప్రొడక్ట్ మేనేజర్ సాయి రామ్ మాట్లాడుతూ, “ఎందరో తెలుగువారు కూ యాప్‌లో చేరుతున్నారు. వారి ఆలోచనలు వ్యక్తపరుచుకుంటూ ఇక్కడ ఉన్న పెద్ద తెలుగు కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కొత్త స్నేహితులను పొందుతున్నారు. మరెక్కడా చూడని విధంగా ఒకరికొకరు అభిప్రాయాలను తెలుపుకుంటున్నారు. ఇది మన తెలుగు కమ్యూనిటీ సమావేశ వేదిక. ఈ విప్లవాన్ని ప్రారంభించినందుకు ఒక తెలుగు వాడిగా నాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సంకేతాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇంత వైవిధ్యమైన మరియు చైతన్యవంతమైన తెలుగు కమ్యూనిటీని నేను మరెక్కడా చూడలేదు” అని తెలిపారు.