బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (11:30 IST)

టిక్ టాక్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ నుంచి కొత్త యాప్..

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అంటే ఎగబడేవారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. కొత్త కొత్త యాప్‌లతో ప్రజలు టెక్నాలజీని తెగ వాడేస్తున్నారు. ఇప్పటికే టిక్ టాక్, షేర్ చాట్ వంటి యాప్‌లను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగిందని టాక్ వస్తోంది. అలాంటి తరుణంలో ఫేస్‌బుక్ నుంచి కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నారు. 
 
ప్రస్తుతం టిక్ టాక్‌తో అటు ఫేస్‌బుక్, ఇటు వాట్సాప్ రెండింటికీ గట్టి పోటీ ఇస్తోంది. దీనికి తోడు... హెలో, రోపోసో, షేర్ చాట్ లాంటివి కూడా వీడియోలతో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఫేస్ బుక్‌ని దాదాపు మర్చిపోతున్నారు. వాట్సాప్ కూడా ఎప్పుడో ఓసారి అలా చూసి ఇలా క్లోజ్ చేస్తున్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే టిక్ టాక్ లాంటిదే ఓ యాప్ తేవాలని ఫేస్ ‌బుక్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
 
ఇందులో భాగంగా సరికొత్త యాప్స్‌ను ప్రవేశబెట్టబోతున్నట్లు గతవారం ఫేస్ బుక్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకించి న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ (ఎన్‌పీఈ) టీంని ఏర్పాటు చేసింది. ఇందుకోసం యూఎక్స్ డిజైనర్లు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. త్వరలోనే టిక్ టాక్ తరహా యాప్ ఫేస్‌బుక్ నుంచి రానుంది.