మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (14:19 IST)

జియో బ్రాడ్‌‌బ్యాండ్‌‌ ఇంటర్నెట్‌‌ బేస్‌‌ ధర రూ.351లకు తగ్గింపు

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌‌‌‌ అంబానీ జియో పేరుతో టెలికాం కంపెనీని 2016లో ప్రారంభించినప్పుడు.. ప్రజలంతా దాని సిమ్‌‌‌‌కార్డుల కోసం క్యూలు కట్టారు. నెల రోజులపాటు జియో స్టోర్ల ఎదుట ఎప్పుడూ చూసినా రద్దీ కనిపించేది. సిమ్‌‌‌‌కార్డ్‌‌‌‌ దొరికితే పండగే అన్నట్టు ఉండేది పరిస్థితి. మొదటి జియో సేవలను ఉచితంగా ఇచ్చారు. తదనంతరం చౌక టారిఫ్‌‌‌‌లతో అందించడమే డిమాండ్‌‌‌‌కు కారణం. 
 
జియో గిగాఫైబర్‌‌‌‌ పేరుతో బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ సేవలను ప్రకటించినప్పుడు కూడా ఉత్సాహం కనిపించింది. కొన్ని నెలలపాటు దీని సేవలనూ ఉచితంగా ఇచ్చారు. మూడు నెలల క్రితం టారిఫ్‌‌‌‌లను ప్రకటించిన తరువాత మాత్రం జనంలో ఆసక్తి తగ్గింది. కనీస చార్జీలు రూ.699ల నుంచి మొదలుకావడమే ఇందుకు ప్రధాన కారణం. జియో ప్రత్యర్థులు ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, యాక్ట్‌‌‌‌, హాత్‌‌‌‌వే వంటి ఆపరేటర్ల చార్జీలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. 
 
యాక్ట్‌‌‌‌ కంపెనీ అయితే నెలకు 450 రూపాయలకు 40 ఎంబీపీఎస్‌‌‌‌ స్పీడుతో సేవలు అందిస్తున్నది. జియో ఇంటర్నెట్‌‌‌‌తోపాటు వాయిస్‌‌‌‌ కాలింగ్‌‌‌‌ సేవలనూ అందిస్తున్నా టారిఫ్‌‌‌‌ ఎక్కువ కావడంతో కస్టమర్ల సంఖ్య ఆశించినస్థాయికి చేరలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జియో బేస్‌‌‌‌ టారిఫ్‌‌‌‌ను రూ.351కి తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
దీనిపై జియో ఆఫీసర్ ఒకరు వివరణ ఇస్తూ ఇక నుంచి కూడా రూ.699 నుంచే ప్లాన్లు మొదలవుతాయని, ప్రతి ప్లాన్‌‌‌‌కు రూ.351 బేస్‌‌‌‌ ధర అని చెప్పారు. ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లోనూ తెలిపామని అన్నారు. అయితే రూ.699 ప్లాన్‌‌‌‌కు నెలకు 150 జీబీ చొప్పున హైస్పీడ్‌‌‌‌ డేటా ఇస్తున్నారు. ఈ మొత్తం అయిపోయాక స్పీడ్‌‌‌‌ 1 ఎంపీబీఎస్‌‌‌‌కు తగ్గుతోంది. అలాంటి సమయంలో అదనంగా డేటా పొందడానికి రూ.234 ప్రిపెయిడ్‌‌‌‌ వోచర్‌‌‌‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది కొంటే వారంరోజులపాటు అన్‌‌‌‌లిమిటెడ్‌‌‌‌ డేటాను పొందవచ్చు.
 
టారిఫ్‌‌‌‌లు మరింత తగ్గే చాన్స్‌ ‌‌‌... 
మనదేశంలో ప్రస్తుతం బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ యూజర్ల సంఖ్య రెండు కోట్లు. తన కస్టమర్ల సంఖ్యను త్వరలోనే రెండు కోట్లు పెంచుకోవడానికి జియో ప్రయత్నిస్తోంది. క్రమంగా వీరి సంఖ్య ఐదు కోట్లకు పెంచాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది. జియో టారిఫ్‌‌‌‌లను బట్టి చూస్తే ఈ టార్గెట్ చేరడం కష్టమే. టారిఫ్‌‌‌‌లను తగ్గించకుంటే బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లో వృద్ధి తక్కువగానే ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 
 
ఈ ఏడాది సెప్టెంబరు నాటికి జియో బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ కస్టమర్ల సంఖ్య ఏడు లక్షలు. ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ కస్టమర్ల సంఖ్య 23.5 లక్షలు. ఈ టార్గెట్‌‌‌‌ను చేరుకోవడానికి కంపెనీకి చాలా ఏళ్లు పట్టాయి. జియో లక్ష్యం నెరవేరాలంటే బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ సేవలను విస్తరణను పెంచి టారిఫ్​లను పెంచాలని నిపుణులు అంటున్నారు.