భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా నిలిచిన జియో
రిలయన్స్ జియో భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ 2024కు గాను విడుదల చేసిన గ్లోబల్ 500 లిస్ట్‌లోని భారత కంపెనీల్లో ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సేవల సంస్థ రిలయన్స్ జియో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది.
అంతర్జాతీయ టెలికాం రంగంలో జియో కొత్త కంపెనీ అయినప్పటికీ, 610 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువ (14 శాతం వృద్ధి)తో పాటు బ్రాండ్ సత్తా సూచీలో 89 పాయింట్ల స్కోర్, ట్రిపుల్ ఏ బ్రాండ్ రేటింగ్‌తో జియో శక్తిమంతమైన బ్రాండ్‌గా ఎదిగింది.
కాగా, దేశంతోపాటు దక్షిణాసియాలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. ఇంకా ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, సామ్‌సంగ్ వరుసగా టాప్-5లో ఉన్నాయి.