గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (22:47 IST)

జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌ అదుర్స్.. మళ్లీ టాప్‌లోకి..

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో సెకనుకు 21.9 మెగాబిట్‌ డౌన్‌లోడ్ వేగంతో జియో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నిరంతరం డేటా డౌన్‌లోడ్ వేగం పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి.
 
తద్వారా జియో నెట్‌వర్క్‌తో అంతరాన్ని తగ్గించుకున్నాయి. 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల తర్వాత, అక్టోబర్‌లో జియో నెట్‌వర్క్ జూన్‌లో నమోదు చేసిన 21.9 ఎంబీపీఎస్ స్పీడ్ స్థాయిని తిరిగి ప్రారంభించింది. అయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (విఐ) డేటా డౌన్‌లోడ్ వేగంలో వారి నెట్ వర్క్ దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది.