కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌‌ను వేడి నీటితో సబ్బేసి వాష్ చేయొచ్చు.. షాక్ ఫ్రూప్ టెక్నాలజీతో?

స్మార్ట్ ఫోన్‌ నీటిలో పడిందో అంతే సంగతులు. అయితే క్యోసెరా సంస్థకు చెందిన రాఫ్రె కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌ను మాత్రం సబ్బుతో కాదు వేడి నీటితో కూడా వాష్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో అందుబాటులోకి

Selvi| Last Updated: గురువారం, 2 ఫిబ్రవరి 2017 (16:39 IST)
స్మార్ట్ ఫోన్‌ నీటిలో పడిందో అంతే సంగతులు. అయితే క్యోసెరా సంస్థకు చెందిన రాఫ్రె కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌ను మాత్రం సబ్బుతో కాదు వేడి నీటితో కూడా వాష్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.25,660గా ఉంది.

ఇక ఈ ‘రాఫ్రె కేవైవీ 40’ ఫీచర్స్ సంగతికి వస్తే.. 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేను కలిగి వుంటుంది.
వేడి నీటితో సబ్బుతో కడిగే ఈ ఫీచర్‌ను కలిగివున్న ‌ప్రపంచంలోనే తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదేనని క్యోసెరా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. షాక్ ఫ్రూప్ టెక్నాలజీతో దీనిని రూపొందించడం జరిగిందని సంస్థ అధికారులు తెలిపారు.

ఇకపోతే ఎల్ ఈడీ ప్లాష్‌తో 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా మొదలైన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేశారు.

అంతేగాకుండా... 1280x720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, అడ్రినో 505 గ్రాఫిక్ప్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1.4 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను ఇది కలిగివుంటుందని సంస్థ వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :