1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జులై 2025 (14:56 IST)

Made in India.. గ్యాలెక్సీ జెడ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్: రికార్డు స్థాయిలో ప్రీ-ఆర్డర్లు

Galaxy Z Foldables
Galaxy Z Foldables
భారతదేశంలో తయారు చేయబడిన Samsung Galaxy Z Fold7, Galaxy Z Flip7, Galaxy Z Flip7 FE స్మార్ట్‌ఫోన్‌లకు భారతదేశంలో రికార్డు స్థాయిలో ప్రీ-ఆర్డర్లు వచ్చాయని కంపెనీ శనివారం తెలిపింది.
 
కొత్తగా ప్రారంభించబడిన ఏడవ తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మొదటి 48 గంటల్లో 210,000 ప్రీ-ఆర్డర్‌లను పొందాయి. ఇది మునుపటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో Galaxy S25 సిరీస్ కోసం అందుకున్న ప్రీ-ఆర్డర్‌లను దాదాపు సమం చేశాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
"మా మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం వచ్చిన రికార్డ్ ప్రీ-ఆర్డర్‌లు చూస్తే యువత స్మార్ట్ ఫోన్ల వినియోగంపై ఎంత మక్కువ చూపుతున్నారో తెలియజేస్తుంది. భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం అనే మా పెద్ద లక్ష్యానికి ఒక మెట్టు అని సంస్థ ఓ ప్రకటన వెల్లడించింది. 
 
ఇవి కేవలం 215 గ్రాములతో, గెలాక్సీ Z ఫోల్డ్7 గెలాక్సీ S25 అల్ట్రా కంటే తేలికైనది. ఇది మడతపెట్టినప్పుడు కేవలం 8.9 మిమీ మందం, విప్పినప్పుడు 4.2 మిమీ మందం కలిగి ఉంటుంది. ఇది అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రీమియం పనితీరు  అనుభవాన్ని అందిస్తుంది. 
 
మల్టీమోడల్ సామర్థ్యాలతో కూడిన కాంపాక్ట్ AI ఫోన్ అయిన గెలాక్సీ Z ఫ్లిప్7 కొత్త ఫ్లెక్స్‌విండో ద్వారా శక్తిని పొందుతుంది. కేవలం 188 గ్రాముల బరువు, మడతపెట్టినప్పుడు కేవలం 13.7mm కొలతలు కలిగిన గెలాక్సీ Z Flip7 ఇప్పటివరకు ఉన్న వాటిలో అత్యంత సన్నని గెలాక్సీ Z Flip అని కంపెనీ తెలిపింది.