5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైన మోటరోలా
స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకుపోతున్న సంస్థ మోటరోలా. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మోడల్స్‌ని వినియోగదారులకు అందించిన ఈ సంస్థ… ఇప్పుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని వినియోగదారులకు అందించనుంది. అది కూడా 5జీ నెట్‌వర్క్‌ని అందుకునే ఫోన్. మోటరోలా తన తాజా 5జీ స్మార్ట్‌ఫోన్ g సిరీస్‌లో మోటో జీ62 5జీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఈ స్మార్ట్‌ఫోన్‌ని వినియోగదారుల కేవలం రూ. 16,249* ప్రత్యేకమైన ధరకు అందిస్తోంది. ఈ ఫోన్ ఆపరేటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంది.
స్మార్ట్‌ఫోన్‌ని మనం చాలా అవసరాలకు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగిస్తాం. సినిమాలు, గేమ్‌లు మరియు వీడియో చాట్‌ల కోసం మోటో జి62 5జీ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్‌తో వస్తుంది. అంతేకాకుండా ఇది 6.5" ఎఫ్‌హెచ్‌డి ప్లస్ అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లేతో వస్తుంది. వీటితోపాటు మీరు సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన సిరీస్‌లు మరియు గేమ్‌లు ఆడవచ్చు. మీరు 12 5జీ బ్యాండ్‌ల నుండి సూపర్-కనెక్టివిటీ మరియు ట్రూ 5జీ అనుభవాన్ని పొందడం వలన ఎటువంటి లాగ్ లేకుండా ఫోన్‌ని ఆపరేట్ చేయవచ్చు.
దీంతోపాటు… మోటో జీ62 5జీ డాల్బీ అట్మాస్‌తో ట్యూన్ చేయబడిన స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. దీనిద్వారా మెరుగైన మల్టీడైమెన్షనల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. కాబట్టి వినియోగదారులు తమకు ఇష్టమైన సినిమాలు మరియు సంగీతాన్ని మెరుగైన డెప్త్ మరియు సౌండ్‌లో క్లారిటీతో ఆస్వాదించవచ్చు.
ఇవే కాకుండా.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ క్వాడ్-ఫంక్షన్ కెమెరా సిస్టమ్, 8 మెగాపిక్సెల్ వైడ్ ప్లస్ డెప్త్ కెమెరా ఉన్నాయి. తద్వారా వినియోగదారులు ఏ కోణం నుండి అయినా మరియు ఏ కాంతిలోనైనా, అల్ట్రావైడ్ నుండి అల్ట్రా-క్లోజ్ వరకు ఫోటోలను తీసుకోవచ్చు. ఇక ఫోన్‌కు ఎక్కువ సేపు వచ్చే బ్యాటరీ చాలా అవసరం. అందుకోసమే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. కాబట్టి.. కాబట్టి మీరు మీ ఛార్జింగ్ గురించి చిందించాల్సిన అవసరం లేదు. మరోవైపు ఐపీ52-రేటెడ్ డస్ట్ మరియు వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ను అందించే అతి కొద్ది స్మార్ట్‌ఫోన్‌లలో ఇది కూడా ఒకటి.
వీటన్నింటితోపాటు… మోటో జీ62 5జీ మొబైల్ రక్షణ ఫీచర్ కోసం థింక్‌షీల్డ్ సెక్యూరిటీతో భద్రత మరియు గోప్యతపై దృష్టి సారిస్తుంది, ఇది ఫోన్‌ని ముప్పుల నుండి మెరుగైన రక్షణను అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఎక్స్‌పీరియన్స్, ఆండ్రాయిడ్ 13కి హామీతో కూడిన అప్‌డేట్, 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్, మోటో గెస్చర్స్, 3 క్యారియర్ అగ్రిగేషన్, 4x4 మిమో, సైడ్ ఎఫ్‌పిఎస్ పవర్ టచ్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
అందుబాటు మరియు ధర వివరాలు:
మోటో జి62 5జీ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్ మరియు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది మిడ్‌నైట్ గ్రే మరియు ఫ్రాస్టెడ్ బ్లూ అనే రెండు ఆకట్టుకునే వేరియంట్‌లలో వస్తుంది. 19 ఆగస్టు 2022 నుండి అమ్మకాలు మొదలవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ప్లస్ 128 జీబీ మరియు 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.