బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 జూన్ 2022 (22:39 IST)

సరికొత్త మోటో జీ82 5జీ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసిన మోటోరోలా

image
ప్రపంచ ప్రఖ్యాతి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మోటోరోలా. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన మోటోరోలా... ఇప్పుడు తన జీ సీరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసింది. అదే మోటో జీ 82 5జీ. మోటో జీ 82 5జీ విప్లవాత్మకమైన, ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ 10-బిట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనం ఊహించలేని బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది 8-బిట్ డిస్‌ప్లేల కంటే 64 రెట్లు ఎక్కువ. 

 
దీంతోపాటు జీ82 5జీ 120హెచ్ జెడ్ పోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది సన్నగా, చాలా తేలికగా, మరింత మన్నికగా ఉంటుంది. అంతేకాకుండా సంప్రదాయ అమోల్డ్ డిస్‌ప్లేలతో పోలిస్తే సన్నగా ఉండే బెజెల్‌లను అనుమతిస్తుంది. బెస్ట్-ఇన్-క్లాస్ డిస్‌ప్లే డీసీ డిమ్మింగ్, డీసీఐ-పీ3 కలర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ సెగ్మెంట్లో అత్యంత అద్భుతమైన వీక్షణ అనుభవం కోసం ఎస్ జీ ఎస్ బ్లూ ఐ సర్టిఫికేషన్‌తో వస్తుంది.

 
మోటో జీ82 5జీ సెగ్మెంట్లో 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ కెమెరాను ప్రవేశపెట్టిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. అంతేకాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వినియోగదారులకు మరింత స్థిరమైన చిత్రాలు మరియు వీడియోలను తీయడానికి వీలు కల్పిస్తుంది ఇది తక్కువ కాంతి పరిస్థితుల్లో ఫోటోల క్లారిటీని మరింత మెరుగుపరుస్తుంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రావైడ్ మరియు డెప్త్ సెన్సార్‌గా పనిచేస్తుంది. దీంతోపాటు మాక్రో విజన్ లెన్స్ వినియోగదారులను 4ఎక్స్ దగ్గరగా పొందడానికి అనుమతిస్తుంది.

 
ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో వినియోగదారులు తమకు ఇష్టమైన సినిమాలు మరియు సంగీతాన్ని మెరుగైన డెప్త్ మరియు సౌండ్‌లో క్లారిటీతో ఆస్వాదించవచ్చు. ఎందుకంటే ఇందులో మోటో జీ82 5జీ స్టీరియో స్పీకర్‌లతో డాల్బీ అట్మోస్‌తో ట్యూన్ చేయబడి ఉన్నాయి. దీనిద్వారా గొప్ప మరియు మెరుగైన మల్టీడైమెన్షనల్ సౌండ్ మనం వినవచ్చు. అంతేకాకుండా గంటల కొద్దీ వినోదం కోసం 33 వాట్స్ టర్బోపవర్‌చార్జర్‌తో కూడిన భారీ 5000 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.