మొన్న విశాల్‌ సిక్కా.. నేడు నవీన్ : ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్‌ గుడ్‌‌బై

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు. మొన్నటికిమొన్న విశాల్ సిక్కా రాజీనామా చేయగా, ఇపుడు మరో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బుధిరాజ్ రాజీనామా చేశారు.

infosys
pnr| Last Updated: బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:28 IST)
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు. మొన్నటికిమొన్న విశాల్ సిక్కా రాజీనామా చేయగా, ఇపుడు మరో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బుధిరాజ్ రాజీనామా చేశారు. దీంతో గత ఏడాది మార్చి తరువాత
కంపెనీని వీడిన మాజీ సాప్‌ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య12కు చేరింది.

నవీన్ బుధి రాజ్ ఇన్ఫోసిస్ కంపెనీలో సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నాలజీ విభాగం అధిపతిగా పని చేస్తారున్నారు. మరోవైపు బుధిరాజా నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి ఇన్ఫోసిస్ తిరస్కరించింది. కీలక నిర్వహణ సిబ్బంది రాజీనామా లేదా నియామకాలపై తాము వ్యాఖ్యానించలేమని ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా బుధిరాజా 2014, ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరారు. జర్మన్‌ సాఫ్ట్‌వేర్‌ జెయింట్‌ సాప్‌నుంచి దాదాపు 16 మంది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సీనియర్‌ ర్యాంకులతో ఇన్ఫోసిస్‌లో చేరిన వారిలో ఈయన కూడా ఒకరు. ఇన్ఫీ మాజీ సీఈవో విశాల్‌ సిక్కాకు ప్రధాన అనుచరుడిగా బుధిరాజాను పేర్కొంటారు.దీనిపై మరింత చదవండి :