శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2016 (13:04 IST)

న్యూ 'హై ఫైవ్ సెల్ఫీ' ట్రెండ్.. ప్రాణాలు ఫణంగా పెట్టి సెల్ఫీలు తీస్తున్నారు!

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సెల్ఫీలతో ప్రమాదాలు ముంచుకొస్తున్నా.. ప్రాణాలు పోతున్నా.. యువత ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రపంచ యువతను సెల్ఫీల పిచ్చి పట్టి పీడిస్తోంది. తాజాగా ఈ సెల్ఫీలు కూడా కొత్త

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సెల్ఫీలతో ప్రమాదాలు ముంచుకొస్తున్నా.. ప్రాణాలు పోతున్నా.. యువత ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రపంచ యువతను సెల్ఫీల పిచ్చి పట్టి పీడిస్తోంది. తాజాగా ఈ సెల్ఫీలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు సెల్ఫీల్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సెల్ఫీ తీసుకోవాలంటే... ముందు మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఆన్ చేయాలి.

ఆ తర్వాత సెల్ఫీ కోసం కెమెరాను క్లిక్ మనిపిస్తూనే ఫోన్‌ను గాల్లో పైకి ఎగరవేయాలి. ఆ ఫోన్ గాల్లోంచి కింద పడేలోగానే రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. మీరు క్లాప్స్ కొట్టిన దృశ్యం ఫోన్‌లో నిక్షిప్తం కావాలి. ఇదే నయా ట్రెండ్. దీనికి 'హై-ఫైవ్ సెల్ఫీ' అనే పేరు పెట్టారు. ఈ నయా ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌లా మారింది. సేత్ స్నీడర్ అనే ఓ కుర్రాడు ఇలాంటి సెల్ఫీనే ఆన్‌‌లైన్లో పెడితే... దీనిని 4 లక్షల 40 వేల మంది లైక్ చేశారు. రెండు లక్షల మంది దీనికి రిప్లై ఇచ్చారు. 
 
సెల్ఫీ చాప్టర్‌లో తాజాగా 'హై-ఫైవ్' ఫీవర్‌ మొదలైంది. ఇందులో మీ చిత్రం ఖచ్చితంగా వచ్చినట్లయితే హై-ఫైవ్‌ సెల్ఫీ చాలెంజ్‌లో మీరు నెగ్గినట్టే మరి. ఇలా హై-ఫైవ్‌ సెల్ఫీ చిత్రాన్ని ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టుగా కామెంట్‌ చేయటం ఇపుడో ట్రెండ్‌. అయితే ఈ సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఫోన్‌ కిందపడితే ఏమైనా ఉందా..! అనుకునేవాళ్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
కింద దిండులు, పరుపులు ఏర్పాటు చేసుకుని 'హై-ఫైవ్'’కి స్వాగతం పలుకుతున్నారు. ఫోన్‌కి ఏమైనా ఫర్వాలేదు చాలెంజ్‌ నెగ్గాల్సిందేనని డిసైడ్‌ అయిన వాళ్లు ఈ జాగ్రత్తలు పాటించకుండా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రమాదపుటంచుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. హై-ఫైవ్‌ జోన్‌లో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరుగుతాయో!