గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (13:01 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్: కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌పై క్లిక్‌ చేస్తే..?

సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ ప్రకారం వినియోగదారులు ఏదైనా కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌పై క్లిక్‌ చేస్తే.. వారి స్టేటస్‌ సైతం కనిపించనుంది. ప్రస్తుతం యూజర్ల కాంటాక్టుల స్టేటస్‌లు చూడటానికి ప్రత్యేకంగా ఒక ట్యాబ్‌ ఉంది. 
 
ఇందులో అందరి స్టేటస్‌ అప్‌డేట్‌లు కనిపిస్తాయి. ఈ కొత్త ఫీచర్‌ అప్‌డేట్‌ అయిన తరువాత, యూజర్లు సంబంధిత కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌తో పాటు, అదే ఐకాన్‌ నుంచి నేరుగా ఆ కాంటాక్ట్‌ స్టేటస్‌ను సైతం చూసే అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ యూజర్లు ఏదైనా కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ను క్లిక్‌ చేస్తే, రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి. 
 
'షో ప్రొఫైల్‌ పిక్చర్‌' లేదా 'లేటెస్ట్‌ స్టేటస్‌ అప్‌డేట్‌' ఆప్షన్లపై వినియోగదారులు క్లిక్‌ చేయవచ్చు. దీని ద్వారా గతంలో మాదిరిగా ఇతరుల వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ను చూడవచ్చు. లేదంటే వారి స్టేటస్‌ను అక్కడి నుంచే నేరుగా చూడవచ్చు. బీటా వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ ఉన్నట్లు వాట్సాప్‌ ట్రాకర్‌ తెలిపింది. అయితే తాజా వాట్సాప్‌ బీటా వెర్షన్‌లోనూ ఈ ఫీచర్‌ కనిపించట్లేదట. ఈ ఫీచర్‌ గురించి వాట్సాప్‌ సైతం అధికారికంగా స్పందించలేదు.