గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (19:16 IST)

వాట్సాప్ నుంచి కొత్త కొత్త ట్రిక్స్...

whatsapp
వాట్సాప్ నుంచి కొత్త కొత్త ట్రిక్స్ వచ్చేస్తున్నాయి. వాట్సాప్‌లో మీ పార్ట్నర్ ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తున్నారో తెలుసుకునే ట్రిక్ వచ్చేసింది. ఇందుకు ముందుగా కావాల్సింది లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ యాప్ వుండాలి. ఈ ట్రిక్ కోసం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి వుంటుంది. తర్వాత స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 
 
అనంతరం డిస్ ప్లే అయ్యే ఆప్షన్‌లో మేనేజ్ స్టోరేజ్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు టెక్ట్స్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోల డేటా ఆధారంగా లిస్ట్ కనిపిస్తుంది. ఈ లిస్టులో ఎక్కువ చాట్ డేటా ఉన్నవారి కాంటాక్ట్ ఫస్ట్ వుంటుంది. అంటే మీ ఫ్రెండ్ లేదా పార్ట్‌నర్ ఎక్కువగా వారితో చాట్ చేస్తున్నారన్నమాట. 
 
మీడియా ఎక్కువగా షేర్ చేయడం వల్ల కూడా చాట్ స్టోరేజీ పెరుగుతుంది. ఈ ట్రిక్స్ ద్వారా పార్ట్‌నర్ ఎవరితో చాట్ చేస్తున్నారో తేలిపోతుంది. అయితే వాట్సాప్‌లో ఇలాంటి ట్రిక్స్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.