గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2025 (22:05 IST)

ఏ ఒక్క కంపెనీ కూడా ఏఐ ప్రభావాన్ని తట్టుకోలేదు : సుందర్ పిచ్చాయ్

sunder pichai
కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావంపై గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ సీఈవో సుందర్ పిచ్చాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే ఏఐ దెబ్బకు ఏ ఒక్క కంపెనీ కూడా తట్టుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇదో అసాధారణ సందర్భమని, ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ బూమ్ హేతుబద్దత లేదని అన్నారు. 
 
ఒకవేళ ఏఐ విస్ఫోటన్ చెందితే దాని ప్రభావం అంతటా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విస్పటవాన్ని ఎదుర్కొనే స్థితిలో గూగుల్ సంస్థ ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఆ తుఫాన్‌ను తమ కంపెనీ తట్టుకుంటుందని కానీ, ఏదైనా సాధ్యమే అని ఆయన అన్నారు. వాస్తవానికి ఏ కంపనీ కూడా ఏఐ ప్రభావానికి లోనుకాకుండా ఉండలేదన్నారు. ఆ జాబితాలో తమ సంస్థ కూడా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు.