నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిఫ్ కార్ట్ ఆఫర్లు..
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నోకియా స్మార్ట్ టీవీలపై బిగ్ బిలియన్ షాపింగ్ డేస్ సందర్భంగా ఆఫర్లు అందిస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో నోకియా 32, 43, 50, 55 65 అంగుళాల స్మార్ట్ టీవీలను విక్రయిస్తుంది.
అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ స్పెషల్స్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు నోకియా స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేసినట్టు నోకియా ప్రకటించింది.
నోకియా బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా పూర్తిగా కొత్త స్మార్ట్ టీవీ శ్రేణికి విస్తరించడం తమ విజయానికి నిదర్శమని నోకియా బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ మెహ్రోత్రా తెలిపారు. గత ఏడాది భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసినప్పటినుంచి తమ టీవీలకు స్పందన బావుందంటూ హర్షం చేశారు.
పండుగ సీజన్ షాపింగ్‌ను ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు అందుబాటులో ధరల్లో నోకియా సహకారంతో వైవిధ్యమైన స్మార్ట్ టీవీలను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ అయ్యర్ తెలిపారు.