గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (16:18 IST)

క్రేజీ ఫీచర్లతో నథింగ్ ఫోన్ వన్ గ్రాండ్ ఎంట్రీ

nothing one phone
ట్రెండీ స్మార్ట్‌ ఫోన్‌గా ఊరించిన నథింగ్ ఫోన్ వన్ గ్రాండ్‌గా భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం రాత్రి నుంచి ఈ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో క్రేజీ ఫీచర్లతో పాటు హాట్ స్పెసిఫికేషన్స్‌తో నెలల తరబడి నిరీక్షణకు తెరదించుతూ లాంఛ్ అయింది. యానిక్ డిజైన్‌గా పేరొందిన నథింగ్ ఫోన్ వన్ కోసం కొన్ని నెలల పాటు సాగిన నిరీక్షణకు తెరపడింది. విభిన్నమైన ఈ డిజైవ్ అందరినీ ఆకట్టుకుంది.
 
ఇందులో వైర్డ్, వైర్‌లెస్ చార్జెర్ అనే రెండు అప్షన్లు ఉన్నాయ. అలాగే ట్రాన్స్‌పరెంట్ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోటిఫికేషన్లు, బ్యాటరీ ఇండికేటర్, కాల్స్ అలెర్ట్‌లకు ప్రత్యేక లైటింగ్ ప్యాటర్న్ ఉండటం మరో క్రేజీ ఫీచర్‌గా చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 
 
8జీబీ ర్యాం, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ధర రూ.32999గా ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీపీ స్టోరేజ్ ధర రూ.35999గా, 12 జీవీ ర్యాల్ 256 జీపీ స్టోరేజ్ ధర రూ.38999గా ఉంది. కాగా, ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్ సాధారణ విక్రయాలు దేశ వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. ఆఫ్ లైన్‌‌లో కొనుగోలు చేసేందుకు మాత్రం కొద్ది రోజులు వేచి ఉండక తప్పదు.