శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (19:59 IST)

డెబిట్ కార్డులా ఆధార్ కార్డ్.. పీవీసీ కార్డు వచ్చేసింది.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఆధార్ కార్డ్ సైజ్ మారనుంది. జేబులో పెట్టుకునేందుకు వీలుగా ఈ కార్డును కొత్తగా, ఆకర్షణీయ రూపులోకి తీసుకురానున్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్ కార్డులా ఆధార్ కార్డు కూడా మారనుంది. క్రెడిట్‌, డెబిట్ కార్డుల సైజ్‌లో ఉండి పర్స్‌లో పట్టే విధంగా మార్పులు చేసి పీవీసీ(పాలి వినైల్ క్లోరైడ్‌) కార్డులను యూఐడీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు హోలోగ్రామ్ కూడా ఉంటుంది.
 
కొత్త తరహా పీవీసీ కార్డు కోసం యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పీవీసీ కార్డు మీ ఇంటికి వస్తుంది. ఈ కొత్త కార్డు కోసం రూ.50 ఛార్జి వసూలు చేస్తారు. పీవీసీ ఆధార్ కార్డు దరఖాస్తు చేసేందుకు ముందుగా యూఐడీఏఐలోకి వెళ్లాల్సి వుంటుంది. గెట్ ఆధార్ అనే ఆప్షన్ కింద Order Aadhaar PVC Card అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
 
ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ లేకుంటే వర్చువల్ ఐడీ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీని అయినా ఎంటర్ చేయవచ్చు. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబర్ లింక్ లేకుంటే.. My Mobile number is not registered అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్‌లో క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
 
Send OTPపై క్లిక్ చేయగానే మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు ఫొటోతో సహా మన వివరాలు వెబ్‌సైట్ పేజిపై కనిపిస్తాయి. వాటిని సరిచూసుకున్న తర్వాత Make Paymentపై క్లిక్ చేయాలి. పేమెంట్స్ అయ్యాక రసీదు కూడా వస్తుంది. అందులోని SRN నంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి. పది రోజుల్లో ఆధార్ కార్డులోని అడ్రస్‌కు పీవీసీ కార్డు వెళ్తుంది. SRN నంబర్ ఉపయోగించి.. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని గెట్ ఆధార్ విభాగంలో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.