Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా?

Written By సెల్వి
Updated: సోమవారం, 13 జూన్ 2022 (10:08 IST)
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం వాడుక దారులకు షాకింగ్ న్యూస్. పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఇక సర్ ఛార్జ్‌లు తప్పవు. ఎందుకంటే పేటీఎం ఇటీవల రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించింది. 
 
ఈ రుసుము రూ. 1 నుండి రూ. 6 వరకు ఉంటుంది. సర్‌ఛార్జ్ ఎంత అనేది మీరు చేసుకునే రీఛార్జ్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఛార్జీలు అన్ని పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లపై వర్తించనుంది. గతేడాది.. ఫోన్‌పే తన కస్టమర్‌లకు రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్‌ని అమలు చేసిని విషయం తెలిసిందే. 
 
ఈ విషయంపై ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు తమ పోస్టుల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి నుంచే పేటీఎం ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఛార్జీలు పడుతున్నాయి. 
 
ప్రస్తుతం.. ఈ రుసుము రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై కనిపిస్తోంది. 2019 సంవత్సరంలో, పేటీఎం దాని వినియోగదారుల నుండి సర్‌ఛార్జ్ రుసుములను వసూలు చేయదని చెప్పింది.

అన్నీ చూడండి

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా

Balakrishna: బాలయ్యతో మళ్లీ జతకట్టనున్న విజయశాంతి?

Master Arun: సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

కన్నడలో యష్‌ తో చేయాల్సింది - బాబీ నన్ను ఎంకరేజ్ చేశారు : డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల

Teja Sajja: ది ట్రెయిటర్స్ గేమ్ మిస్టరీ గా ఉంటుంది, జాంబీ రెడ్డి 2 చిత్రీకరిస్తున్నాం తేజ సజ్జ

తర్వాతి కథనం
Show comments