శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (19:51 IST)

గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే.. మూడో స్థానంలో పేటీఎం

phonepe
గూగుల్ పేను ఫోన్ పే వెనక్కి నెట్టింది. డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన ఫోన్ పే గూగుల్ పేకి బాగా అలవాటు పడిపోయారు. క్షణాల్లో నగదు బదిలీ అవకాశం ఉండటం క్యాష్ రివార్డులు ఇస్తుండటంతో ఈ యాప్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కారణంగా ప్రజలు నగదుకు బదులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా వాడుతున్నారు. 
 
ఈ క్రమంలో ఫోన్ పే యాప్‌ల ద్వారా ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.1.82 లక్షల కోట్ల విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గూగుల్ పే ద్వారా రూ .1.76 లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. అంటే యూపిఐ లావాదేవీల్లో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న గూగుల్ పేను ఢీకొట్టి ఫోన్ పే అగ్రస్థానంలో నిలిచింది. 
 
డిసెంబర్ నెలలోనే ఫోన్పే ద్వారా రూ.182126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి.  గూగుల్ పే విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా గూగుల్ పే లావాదేవీల పరిమాణం (960.02 మిలియన్) లో 11 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబరులో లావాదేవీ విలువలో 9.15 శాతానికి పైగా పడిపోయింది. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది.