జల్సా పేరుతో పోస్ట్ పెయిడ్ ఆఫర్... ఆర్ కామ్ ప్రకటన.. రూ.333లతో?

''జల్సా'' అన్ లిమిటెడ్ పేరుతో పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఈ ఆఫర్ తెచ్చినట్లు ఆర్ కామ్ తెలిపింది. రూ.333 రూపాయలతో ఈ ఆఫర్ తీసుకునే పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 30 జీబీ 4జీ డే

jio - google smart phone
selvi| Last Updated: శనివారం, 17 జూన్ 2017 (13:48 IST)
''జల్సా'' అన్ లిమిటెడ్ పేరుతో పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఈ ఆఫర్ తెచ్చినట్లు ఆర్ కామ్ తెలిపింది. రూ.333 రూపాయలతో ఈ ఆఫర్ తీసుకునే పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 30 జీబీ 4జీ డేటా వినియోగించుకోవచ్చు. అలాగే ఏ ఇతర నెట్‌వర్క్‌కైనా 1000 నిమిషాల ఉచిత లోకల్, మరో 1000 ఉచిత ఎస్టీడీ నిమిషాలు.. 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ అని ఆర్ కామ్ తెలిపింది. ఇప్పుడే ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఏడాదిపాటు ఈ ఆఫర్ పొందవచ్చని ఆర్‌కామ్ వెల్లడించింది.

ఇక జియో రాకతో టెలికాం సంస్థలు ఉచిత డేటా పేరిట టారిఫ్‌లను తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లో గణనీయమైన వాటా దక్కించుకునేందుకు జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి సంస్థలు జియోతో పోటీపడి ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తన టారిఫ్‌లలో మార్పులు చేసింది.

ఇక జల్సా అన్ లిమిటెడ్ ప్లాన్ 333 బెనిఫిట్స్ ఏంటంటే?
రూ.333 ప్లస్ సర్వీస్ టాక్స్‌తో అన్నీ నెట్‌వర్కులకు వాయిస్ కాల్,
* ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఫ్రీ రోమింగ్
* నేషనల్, లోకల్ 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ
* వాలిడిటీ 30 డేస్
* ఈ ప్లాన్ ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు వర్తిస్తుంది.దీనిపై మరింత చదవండి :