రియల్ మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు
రియల్ మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు రీలీజ్ అయ్యింది. మార్చిలోనే రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. కరోనా లాక్‌డైన్ కారణంగా లాంఛింగ్ రెండు సార్లు వాయిదా పడింది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఉండటంతో రియల్ మీ ప్రస్తుతం ఆవిష్కరించింది.
రియల్‌మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో వున్న ఈ ఫోన్లతో పాటు.. నోర్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొత్తగా ప్రకటించింది రియల్‌మీ. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని తెలుస్తోంది.