శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 జులై 2017 (11:13 IST)

షాకింగ్ న్యూస్ : జియో కస్టమర్ల సమాచారం లీక్?

షాకింగ్ న్యూస్. రిలయన్స్ జియో కస్టమర్ల సమాచారం లీక్ అవుతోంది. కస్టమర్ డేటాబేస్ హ్యాక్ అయిందని, ఈ క్రమంలోనే magicapk.com అనే వెబ్‌సైట్‌లో జియో యూజర్ల పూర్తి వివరాలు దర్శనమిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ

షాకింగ్ న్యూస్. రిలయన్స్ జియో కస్టమర్ల సమాచారం లీక్ అవుతోంది. కస్టమర్ డేటాబేస్ హ్యాక్ అయిందని, ఈ క్రమంలోనే magicapk.com అనే వెబ్‌సైట్‌లో జియో యూజర్ల పూర్తి వివరాలు దర్శనమిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్‌ను కూడా పలువురు నెటిజన్లు పోస్ట్ చేశారు. 
 
దేశంలో జియో టెలికాం సేవలు ఓ విప్లవాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. అలాగే, టెలికాం రంగంలో కూడా శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం జియోకు 12 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం జియోలో ఉన్న 12 కోట్ల మంది కస్టమర్ల సమాచారం లీకైందని ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. 
 
జియో కస్టమర్లకు చెందిన ఫోన్ నంబర్, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలతోపాటు ఆధార్ నంబర్లు కూడా సదరు వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయని, మన దేశంలో ఇప్పటివరకు ఇలా అత్యంత భారీ ఎత్తున డేటా లీక్ అవడం ఇదే తొలిసారి అని పలు టెక్ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. 
 
అయితే ఈ వార్తలపై జియో స్పందించింది. తన కస్టమర్ డేటాబేస్ ఏ మాత్రం హ్యాక్ కాలేదని, వారి వివరాలు, సమాచారం అంతా సురక్షితంగా ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని జియో ప్రతినిధి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయం పట్ల విచారణ చేస్తున్నామని, డేటా లీక్ అయిందనే సమాచారం మాత్రం నిజం కాదని, అవి కేవలం వదంతులే అని కొట్టి పారేశారు.