మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (18:47 IST)

రూ.3,499 డేటా ప్లాన్... రోజుకు 3GB డేటా,100 ఎస్సెమ్మెస్‌లు

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.3,499కే రోజుకు 3GB డేటాతో అందిస్తుంది. ఇది ఏడాది కాలపరిమితితో కూడిన ప్లాన్. రోజులో 3GB డేటా పరిమితి పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 64KBPSకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. ఇంకా వివరాలు కావాలంటే జియో యాప్, వెబ్ సైట్‌లో చూడవచ్చు.
 
రూ.349, రూ.401, రూ.999 ప్లాన్స్‌తో ప్రతిరోజు 3GB డేటా వస్తుంది. ఈ ప్లాన్ కింద వివిధ జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ఏడాది కాలపరిమితి గల డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఏడాది కాలపరిమితి కలిగి రోజుకు 3GB డేటా అందించే విధంగా ఇప్పటి వరకు జియో ఎలాంటి ప్లాన్స్‌ను తీసుకురాలేదు.
 
రూ.999 ప్లాన్‌లో రోజుకు 3GB డేటాను 84 రోజులు, రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 28 రోజుల పాటు 90GB డేటా, ఇది రోజుకు 3GBతో అందిస్తోంది. ఈ ప్లా్నస్ కాలపరిమితి కలిగిన రోజులకు డి+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వినాయకచవితి నాటికి అతి తక్కువ ధరకే 4G స్మార్ట్‌ఫోన్ జియో నెక్స్ట్‌ను తీసుకు రానున్న విషయం తెలిసిందే