మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (11:09 IST)

జియో చౌక ధర ఫోన్ల కోసం.. కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో గత ఏడాది చౌకధరకు ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం రూ.49లకు స్పెషల్ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం జియో ఫోన్ కోసం వ్యాలిడిటీతో కూడిన ఆఫర్లను ప్రకటించింది. రూ.594, రూ.297 ధరలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 
 
రూ.594 రీఛార్జ్.. 
ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 0.5 డేటా, 28 రోజులకు 300 ఎస్ఎమ్ఎస్‌లు 168 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. 
 
రూ.297 రీఛార్జ్.. 
ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 0.5 జీబీ అత్యధిక వేగంతో కూడిన డేటా, 28 రోజులకు 300 ఎస్ఎమ్‌ఎస్, జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ 84 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.